మహిళా పైలట్‌కు కల్ట్ జిమ్ మేనేజర్ వేధింపులు

TG: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు వేధింపులు కలకలం సృష్టించాయి. జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోబరుచుకోవడానికి కల్ట్ జిమ్ ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఒప్పుకోకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై అసభ్యకర మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సంతోష్ గౌడ్‌కు అతని గర్ల్‌ఫ్రెండ్ రజిని సహకరించిందని పోలీసులకు తెలిపింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్