హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఓ మహిళా పైలట్‌పై జిమ్ ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్‌గౌడ్ వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జిమ్ ట్రైనింగ్ పేరుతో లోబర్చుకునేందుకు ప్రయత్నించి, అంగీకరించకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య మెసేజ్‌లు పంపినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మేనేజర్‌కు అతని గర్ల్‌ఫ్రెండ్ రజనీ సహకరించినట్లు పోలీసులకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.