ఫెంగల్‌ ఎఫెక్ట్.. చూస్తుండగానే కుప్పకూలిన భవనం(వీడియో)

తమిళనాడులో ఫెంగల్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం నుంచి ఫెంగల్‌ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ క్రమంలోనే మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్‌ దెబ్బకు కుప్పకూలింది. చూస్తుండగానే భవనం కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్