భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

రైతులకు త్వరలో బిగ్ షాక్ తగలవచ్చని తెలుస్తోంది. వానాకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన నేపథ్యంలో, ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులను నిలిపివేయడం రబీ సీజన్‌లో సమస్యలను పెంచనుంది. భారతదేశం యూరియా, డీఏపీ వంటి ఎరువులను దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఆంక్షల కారణంగా ఎరువుల ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగితే, రైతులకు అదనపు భారం తప్పదు.

సంబంధిత పోస్ట్