ఫీటల్‌ ఆల్కహాల్‌ సిండ్రోమ్‌.. ఎలా నిర్ధారించారు?

తండ్రుల్లో మద్యం అలవాటు పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికాలోని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకుడు మైఖేల్‌ గోల్డింగ్‌ ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో, గర్భధారణకు ముందు తండ్రి ఎలుకకు మద్యం ఇవ్వగా, వాటి పిల్లల్లో దవడల ఆకృతి మారడం, కళ్లు చిన్నవిగా అవ్వడం, దంతాల మధ్య సందులు వంటి ఫీటల్‌ ఆల్కహాల్‌ సిండ్రోమ్‌ లక్షణాలు కనిపించాయి. తండ్రి ఎంత ఎక్కువ తాగితే, పిల్లల్లో అనారోగ్య సమస్యల తీవ్రత, మెదడు పనితీరు, నేర్చుకునే సామర్థ్యం అంతగా మందగిస్తుందని నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్