ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో 11వ శతాబ్దానికి చెందిన చారిత్రక డార్మిషన్ కేథడ్రల్ భారీగా దెబ్బతింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని, జీ-7 దేశాలు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని కోరారు. ఈ దాడుల అనంతరం జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్, రష్యా వర్గాలు వెల్లడించాయి.