భీకర యుద్ధం.. 89 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 89 మంది మృతి చెందగా, 700 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రాజధాని బీరట్, దక్షిణ లెబనాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. మిస్సైళ్ల ధాటికి భవనాలు నేలకూలాయి. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. శిథిలాల కారణంగా ఆస్పత్రులకు వెళ్లే దారులు మూసుకుపోవడంతో అంబులెన్సులు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్