ట్రంప్ ఒత్తిడితో ఫిఫా నిబంధనల మార్పు?.. వివాదంలో బాలోగన్ రెడ్ కార్డ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ బాలోగన్‌కు రిఫరీ ఇచ్చిన రెడ్ కార్డ్ వివాదం అంతర్జాతీయ రాజకీయ హాస్యంగా మారింది. బాలోగన్‌కు రెడ్ కార్డ్ చూపించి తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంకా జరగని మ్యాచ్ గురించి ఇప్పుడే నిర్ణయం ఎలా తీసుకుంటారు?' అని ప్రశ్నిస్తూ ఫిఫా అధికారులతో మాట్లాడారు. ట్రంప్ జోక్యంతో బాలోగన్‌పై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు వార్తలు రావడంతో ఫుట్‌బాల్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ నిర్ణయం ట్రంప్ ఒత్తిడి వల్లే జరిగి ఉంటే, భవిష్యత్తులో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల పరిస్థితి ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్