ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026, జూన్ 11న ప్రారంభమైంది. ఈసారి యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. కెనడాలో జరిగిన ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె ప్రత్యేక ఫుట్‌బాల్ ఆంథెమ్‌ను ఆలపిస్తూ, వందలాది మంది డ్యాన్సర్లతో కలిసి స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ టోర్నీ జూలై 19న ముగియనుంది.