ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణలో వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం కింద అందించే 'రైతు భరోసా' నిధులను ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు ఎకరాకు రూ. 6,000 చొప్పున, 5 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా 5 నుంచి 6 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసింది. ఐదో విడతలో భాగంగా 1.69 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.545.41 కోట్లు జమ చేసింది.

సంబంధిత పోస్ట్