కర్ణాటక బెళగావి జిల్లాలో చికెన్ కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. వినోద్ మలశెట్టి తన స్నేహితుడు అభిషేక్ కొప్పాడ్ నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. భోజన సమయంలో మరింత చికెన్ కావాలని విట్టల్ అడిగాడు. లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో విట్టల్ కత్తితో వినోద్‌ను దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలవరాన్ని సృష్టించింది.