అంజీర్ పండ్లతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట అంజీర్ పండ్లను నానబెట్టి మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్‌లో తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంజీర్ పండ్లలో ఉండే క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్.. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది.