టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గిరిబాబు 1946లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1973లో 'జగమే మాయ' సినిమాలో విలన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కురుక్షేత్రం, మెరుపు దాడి, సింహగర్జన, ఇడియట్, అతడు, కితకితలు, రేసుగుర్రం లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕