ఆర్థిక సమస్యలు, బ్యాంకుల వేధింపులే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయా!

ఆర్థిక సమస్యలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల కారణంగా ఎదురవుతున్న వేధింపులు అనేక మందిని ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు రికవరీ ఏజెంట్ల ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, చాలా మంది రుణగ్రహీతలు కావాలని అప్పులు ఎగ్గొట్టాలని అనుకోరని వివరించారు. కేవలం 1-2 శాతం మంది మాత్రమే అటువంటి ఉద్దేశ్యంతో ఉంటారన్నారు. అప్పులతో బాధపడుతున్న వారు ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోకుండా సరైన న్యాయవాది, లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.,

సంబంధిత పోస్ట్