బెంగళూరు కేఫ్‌లో గంటకు వెయ్యి ఫైన్!

బెంగళూరులోని ఒక కేఫ్ కార్పొరేట్ మీటింగ్‌లకు, గంటకు మించి కూర్చునే వారికి రూ.1,000 ఫైన్ విధిస్తున్నట్లు నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కేఫ్‌లు, రెస్టారెంట్లలో కొందరు కస్టమర్లు ఎక్కువ సమయం టేబుళ్లను ఆక్రమించడం, తక్కువ ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలుగుతోందని, వ్యాపారానికి నష్టం వాటిల్లుతోందని యజమానులు చెబుతున్నారు. అయితే, కేఫ్‌లు అంటేనే విశ్రాంతి తీసుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి అని చాలా మంది అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్