ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ దేశానికి రావడం ఇదే తొలిసారి. మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.