ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ నాలుగు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం బుధవారం ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. గురువారం ప్రధాని మోదీతో జరగనున్న భేటీలో వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సాయంత్రం 11వ రైసినా డైలాగ్ లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. అనంతరం ముంబైలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.