మాజీ సీఎం కేజ్రీవాల్‌పై FIR నమోదు

మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై కేసు నమోదయింది. ఢిల్లీకి అందే యమునా నది నీటిలో హరియాణా విషం కలుపుతోందని చేసిన ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై సోనిపట్‌లో FIR నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార-విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగాయి. కేజ్రివాల్ వ్యాఖ్యలు జాతికే అవమానం అని ప్రధాని మోదీ మండిపడ్డారు. యమునా నది నీటిని హరియాణా CM నాయబ్ సింగ్ తాగి ఆరోపణలను తిప్పికొట్టారు.

సంబంధిత పోస్ట్