అయోధ్యలో అగ్నిప్రమాదం.. మంత్రికి తప్పిన పెను ప్రమాదం

శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరయూ నది తీరాన జమ్తారా ఘాట్ వద్ద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. యజ్ఞగుండంలోని నిప్పురవ్వలు ఎగిసిపడటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్