బిహార్‌లోని మజఫర్‌పుర్ జిల్లాలోని ప్రసాద్ ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున 3:55 గంటలకు ఐదో అంతస్తులోని ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు రోగులు మృతి చెందినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అధికారులు 20 మంది రోగులను సురక్షితంగా బయటకు తరలించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.