హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం

TG: హైదరాబాద్‌లోని బొల్లారంలో ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 16 కుటుంబాలు నివసిస్తున్నాయి. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్