పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.