గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఖజోడ్ వ్యర్థాల డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెత్త కుప్పలకు మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు.