హైదరాబాద్ హఫీజ్‌పేటలోని పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని దుకాణంలో మంటలు ఆర్పారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.