నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న BMW కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన డ్రైవర్ నరేష్ కౌశల్ వెంటనే కారుని పక్కకు ఆపి బయటకొచ్చారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారు దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.