కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్-ఢిల్లీ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. పిలిభిత్ నుండి జైపూర్ కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. హైటెన్షన్ వైర్లకు బస్సు తగలడంతో మంటలు చెలరేగాయని సమాచారం.