TG: హైదరాబాద్ టోలిచౌకి రోడ్డులో వెళ్తున్న ఓ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నడుపుతున్న వ్యక్తి వెంటనే అప్రమత్తమై బండిని వదిలి పక్కకు వెళ్లాడు. వెంటనే అతను సమీప దుకాణం నుంచి నీళ్లను తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ముందుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.