AP: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.