అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్న 13 మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మిగతా విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.