జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి

జర్మనీలోని బాషుమ్‌ నగరంలో ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల వయసు 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉంది. ఈ అగ్నిప్రమాదం వెనుక మానవ ప్రమేయం, కుట్ర ఉందని అనుమానిస్తూ పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడు కూడా అదే భవనంలో నివసిస్తున్నట్లు తెలిసింది. ఇది హత్య అని అనుమానించడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్లుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕