టేకాఫ్‌ అవుతుండగా..విమానం ఇంజిన్‌లో మంటలు

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సిన స్విస్ విమానం టేకాఫ్‌ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విమానాన్ని నిలిపివేశారు. అత్యవసర స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను కిందకు దించుతున్న సమయంలో ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారికి వసతి ఏర్పాట్లు చేసి, మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్