ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గురుగ్రామ్‌కు చెందిన వివేక్ అగర్వాల్ తన అనారోగ్యంతో ఉన్న తండ్రి రాధేశ్యామ్‌ను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అక్కడ అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో వివేక్, ఆయన భార్య తర్జిని, కుమార్తెలు జివిసా, వరియా, తల్లి లతతో పాటు అత్తామామలు అశోక్, కమల సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ ఒక్కరే మిగిలారు.