చైనా పోర్టులో నిలిపి ఉన్న లైబీరియా జెండాతో కూడిన ఓషియన్ మెలోడీ అనే కార్గో నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది సిబ్బంది మృతి చెందగా, మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారని అక్కడి మీడియా వెల్లడించింది.