తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో రైలు కింది భాగంలో మంటలు వచ్చాయి. డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. బీబీనగర్ వద్ద రైలును ఆపడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గంట నుంచి రైలు బీబీనగర్‌లో నిలిచింది.