కాలిఫోర్నియాలో మరింత వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. పాలిసేడ్స్ ఫైర్ ఒక్కటే 23వేల ఎకరాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేవలం 11% మాత్రమే అదుపు చేయగలిగారు. పొడి వాతావరణం, వర్షం లేకపోవడం, బలమైన గాలులతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మరణించగా, 39 వేల ఎకరాలు కాలిపోయాయి. కెనడా, మెక్సికో ఫైర్ ఫైటర్లు అమెరికాకు సాయంగా రంగంలోకి దిగారు. 14 వేల మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్