భారీగా పెరగనున్న బాణసంచా ధరలు

తమిళనాడులోని శివకాశిలో ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో, ఈ ఏడాది దీపావళి బాణసంచా ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతాయని తయారీదారులు వెల్లడించారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా సల్ఫర్, జిగురు వంటి ముడి పదార్థాల సరఫరా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. దీనితో పాటు, ప్రమాదాల దృష్ట్యా పరిశ్రమలపై పెరుగుతున్న తనిఖీలు, ముడి పదార్థాల కొరత ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕