మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం ప్రాంతంలో బుధవారం సాయంత్రం కాల్పులు కలకలం రేపాయి. ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ సింగ్ సోనూపై కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత్ సింగ్ సోనూ సింగ్ భూజానికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.