TG: హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చాదర్ ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్‌లో శనివారం ఈ కాల్పులు జరిగాయి. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో గన్ మెన్ నుంచి వెపన్ తీసుకుని డీసీపీ చైతన్య సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా.. నాంపల్లి ఆస్పత్రికి తరలించనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.