భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక-ఎ 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. సహన్ అరాచ్చిగే 83, చమిక గుణశేఖర 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవంత వీరసింగే 39, సోహన్ 28, నువానిడు ఫెర్నాండో 44, ఆషెన్ బండార 34, అంజాల బండార 42 పరుగులు చేశారు. భారత్-ఎ బౌలర్లలో సరంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరో 2 వికెట్లు, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశారు.