ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా, రాజకీయ హింసలో బాధితుడైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ చేతుల మీదుగా వీరాంజనేయులు గురువారం ఆర్డర్ కాపీని అందుకున్నారు. 2022 జనవరి 13న హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో, మంత్రి లోకేశ్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా కేబినెట్ తీర్మానం చేసి, చట్ట సవరణ కూడా చేసినట్లు సమాచారం.