తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై కేంద్ర జలశక్తిశాఖ ఏర్పాటు చేసిన కమిటీ, కేంద్ర జలసంఘం కార్యాలయంలో తొలి సమావేశాన్ని సోమవారం, 2వ తేదీన నిర్వహించింది. ఈ భేటీకి జలసంఘం ఛైర్మన్ అధ్యక్షత వహించగా, సీడబ్ల్యూసీ అధికారులు, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ, ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్, తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి పంపకాలు, సమస్యలు, వివాదాలపై చర్చించారు.