అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. హర్ష్ దూబె వేసిన 22వ ఓవర్‌లో ఘజన్‌ఫర్ ఇచ్చిన ఎడ్జ్‌ను స్లిప్‌లో ఉన్న గిల్ అసాధారణ రీతిలో అందుకున్నాడు. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గిల్ చూపిన చురుకుదనం, రిఫ్లెక్సెస్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సూపర్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.