ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య జరగనున్న తొలి వన్డేకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు టాస్ నిలపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గిన తర్వాత టాస్ వేయనున్నారు. కాగా న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య ఇప్పటివరకు 123 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 63, న్యూజిలాండ్ 52 మ్యాచ్‌లలో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్‌ల్లో ఫలితం రాకపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది.