ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 32 ఓవర్లలో 143 పరుగుల టార్గెట్ ఇచ్చారు. భారత్ 22.4 ఓవర్లలోనే 5 వికెట్ల తేడాతో ఛేదించింది. విరాట్ కోహ్లీ (74), శుభ్మన్ గిల్ (37), శ్రేయస్(14), KL రాహుల్(3*), నమన్(5*) రాణించారు. కివీస్ బౌలర్లు జాకబ్ డఫ్ఫీ 3, కైల్ జామిసన్, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు.