తొలి టెస్టు: 368 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లు హెన్రీ నికోలస్ 175 (335 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 118 (216 బంతుల్లో) పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ దీప్ 3, కుల్దీప్ కాంబోజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕