చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు (వాస్కులర్ బ్రెయిన్ డిసీజ్) రాకుండా నిరోధించవచ్చని, వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు శక్తి, మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడతాయి. అలాగే, ప్రోటీన్లు, విటమిన్ డి పుష్కలంగా లభించడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. చేపలు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందని, దృష్టి లోపాలను నివారించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి.