AP: విశాఖపట్నం తీరంలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి బోల్తాపడిన బోటు ఘటనలో ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో కారె చిన్న అనే మత్స్యకారుడు క్షేమంగా బయటపడగా, అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, మెరైన్, కోస్ట్‌గార్డ్ బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనతో మత్స్యకారుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.