మ్యూల్ బ్యాంక్ ఖాతాల కేసులో ఐదుగురు అరెస్టు

TG: సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను అందిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చుడీబజార్‌లోని సాయినాథ్ ఇంట్లో తలదాచుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు స్థానికులకు కమీషన్ల ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు, పాస్‌బుక్‌లను సేకరిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా సేకరించిన ఖాతాల ద్వారా సైబర్ మోసాల సొమ్మును అక్రమంగా బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕