TG: ప్రమాదవశాత్తు క్రేన్‌లు కుప్పకూలి ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన HYD శివారులోని శంకర్పల్లి మండలంలో జరిగింది. ఎన్సీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఈదురు గాలులు, వర్షం కురుస్తుండటంతో అక్కడే ఉన్న షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో ఈదురు గాలులకు క్రేన్లు షెడ్డు మీద కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు మార్గం మధ్యలో మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు ముఖేశ్, నాగేంద్ర మాథుర్ (ఝార్ఱండ్), అలీ హుస్సేన్, సాజిన్ (బిహార్), సోను (యూపీ)గా పోలీసులు గుర్తించారు.