అపార్ట్‌మెంట్‌లో ఐదు అడుగుల నాగుపాము కలకలం

AP: విశాఖపట్నం పెందుర్తిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఐదు అడుగుల నాగుపాము చొరబడటంతో కలకలం రేగింది. సెల్లార్‌లోని వాచ్‌మెన్ గదిలోకి ప్రవేశించిన పామును చూసి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి, పాము పట్టుకున్నారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕